అందాల భామ సెక్సీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌ చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో అనుకోని విధంగా ఆమెపై దాడి జరిగింది. ఈ స్టార్‌ సెక్సీ హీరోయిన్‌ జుట్టు లాగి కింద పడేసే ప్రయత్నం చేసారు. సెప్టెంబర్‌ 26న పారిస్‌లోని మాల్మేన్స్‌ ఫ్యాషన్‌ షోకు హాజరైన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. విటల్నీ సెదుక్‌ అనే వ్యక్తి సెల్రబిటీ ఫ్రాంక్‌స్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్‌ తారలు హాజరయ్యే రెడ్‌ కార్పెట్‌ వేడుకలకు వచ్చి సెలబ్రిటీలపై దాడి చేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుంటాడు. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడ్డ విటల్లీ సెదుక్‌ ఇపుడు కిమ్‌ కర్ధాషియాన్‌ను టార్గెట్‌ చేసాడు. కారు నుండి కిమ్‌ కర్ధాషియాన్‌ కిందకి దిగగానే ఆమె జుట్టు లాగి కింద పడేసే ప్రయత్నం చేసాడు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని చితకబాది కిమ్‌ కర్ధాషియాన్‌ను కాపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: