తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణా ప్రజలకు కోస్తా ప్రాంత వంటలు అంటే అమితమైన ఇష్టం అనే సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగింది. ‘రాజుగారి రుచులు’ పేరుతో నిన్న భాగ్యనగరంలోని కొండాపూర్ ప్రాంతంలో ప్రారంభం అయిన ‘రాజుగారి రుచులు’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి బాలకృష్ణ అతిధిగా వచ్చి సందడి చేసాడు. రాష్ట్ర విభజన తరువాత పాలకొల్లు ప్రాంతం నుండి వచ్చిన ఒక వ్యక్తి ఈ రెస్టారెంట్ ను ప్రారంభించడం బట్టి కోస్తా ప్రాంతం వారు ఇంకా భాగ్యనగరం పై తమ మమకారాన్ని వదులుకోలేక పోతున్నారు అనే విషయానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. రకరకాల రుచికరమైన వంటలు అంటే ప్రాణం ఇచ్చే నందమూరి సింహం బాలయ్య ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో సందడి చేయడం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు అనేక మంది రాజకీయ వేత్తలు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో సందడి చేసారు. పాలకొల్లు రుచులను భాగ్యనగర ప్రజలు ఆదరించడం బట్టి రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారు అంతా ఒకటే అన్న సందేశాన్ని నిన్నటి సంఘటన మరోసారి ఋజువు చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: