అందరూ ఊహించినట్లే ‘గోవిందుడు అందరివాడేలే’ మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చు కోవడంతో కాజల్ అగర్వాల్ చరణ్ తో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ గా రికార్డులకు ఎక్కేసింది. ‘మగధీర’, ‘నాయక్‌’ ల తరువాత తిరిగి చరణ్ తో గోవిoదుడులో జతకట్టిన కాజల్ ట్రెడిషనల్ అమ్మాయిగా కాజల్ లుక్ కు, నటనకు విమర్శకులు మంచి కామెంట్లు ఇస్తున్నారు. గతంలో కాజల్ ఇటువంటి ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన సినిమాలు వచ్చినా ఈ సినిమాలో చెర్రీతో కాజల్ కెమిస్ర్టీ బాగానే వర్కవుట్ అయిందని విమర్శకులు కుడా అంగీకరించడం బట్టి ఒక నాటి గోల్డెన్ లెగ్ హీరోయిన్ కాజల్ కు మళ్ళి టాలీవుడ్ లో గోల్డెన్ పీరియడ్ మొదలు అయినట్లే అంటున్నారు విశ్లేషకులు. అదేవిధంగా గోవిoదుడు సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడు కాజల్ ను చూస్తున్నంత సేపు అచ్చ తెలుగు అమ్మాయిని చూసినట్లు ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  రామ్ చరణ్, కాజల్ ల మధ్య వచ్చే బావా మరదళ్ల సీన్స్ ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ను క్యూ కట్టిస్తాయి అనే వార్తలు వస్తున్నాయి . గతంలో చిరంజీవికి రాధ, విజయశాంతిల జోడి కలిసి వచ్చినట్లుగా ప్రస్తుతం చరణ్ సినిమాలకు అదృష్ట దేవతగా కాజల్ మారిపోయింది అని వినిపిస్తున్న కామెంట్స్ కాజల్ ను మంచి జోష్ లో ముంచేస్తాయి అనే విషయంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: