బాలీవుడ్ బెబో కి, పెళ్ళికి ముందు కంటే, పెళ్ళి తరువాతే భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఈ బెబో తన అందాలను రోజు రోజుకి పెంచుకుంటూనే ఉంది. తన తోటి హీరోయిన్స్ కి పోటీ ఇస్తూనే, పెళ్ళి జీవితాన్ని సైతం ఎంతో ఎంజాయ్ చేస్తుంది. తను చేస్తున్న ప్రాజెక్ట్స్ సెలక్షన్స్ లో చాలా వరకూ మంచి సినిమాలనే ఎంచుకుంటూ, సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే త్వరలో భర్త సైఫ్ అలీఖాన్ తో రెండో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకోబోతుంది. ఇంత సంతోషంగా సాగిపోతున్న జీవితంలో బెబోకు పిల్లల్ని కనాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదట. ఇప్పడప్పుడే తనకు అలాంటి ప్లానే లేదని కరీనా తండ్రి రణధీర్ కపూర్ చెబుతున్నారు. ఈ విషయాన్ని గతంలో బెబో చాలా సార్లు అందరికి వివరించినప్పటికీ, తను ప్రెస్ మీట్స్ కి వెళ్ళిన ప్రతీ సారి, ఎవరో ఒకరు కరీనాని ఎప్పుడు తల్లిగా మారుతున్నావు? అంటూ ప్రశ్నలు తెగ అడుగుతారంట. దీంతో త్వరలోనే తను రెండో వెడ్డింగ్ యానివర్సరీకి సిద్ధంగా ఉండంటంతో కరీనాకి ఈ తరహా ప్రశ్నలు మరింత ఎక్కవయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉంది. అందుకే ముందుగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. "పిల్లల విషయం గురించి ఈమధ్య తనని అడిగాను. ఇప్పట్లో పిల్లలు కావాలని తాను కోరుకోవడం లేదని బెబో చెప్పింది. కాబట్టి నేనేం చేయలేను. పిల్లల విషయంలో ప్రస్తుత తరం ఎవరి నుంచీ సలహా తీసుకోనవసరం లేదు. తను చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇంకా ఆనందంగా ఉన్నాను" అని కరీనా తండ్రి తెలిపారు. అయితే, పెద్ద కుమార్తె, నటి కరిష్మాకు పుట్టిన పిల్లలతో ఆయన హ్యాపీగా ఆడుకుంటున్నాడట మేటర్ ఫినిష్ చేసింది. అయితే ఈ వ్యవహారం సైఫ్ కి పిల్లలు అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. కాని కరీనాకి అస్సలు ఆ ఉద్ధేశం లేదు కాబట్టే, ఇప్పటి వరకూ సైఫ్ అలీ ఖాన్ తండ్రిగా మారే ప్రయత్నాలు చేయలేదని బిటౌన్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: