నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'ఒక లైలా కోసం' ఈ రోజు విడుదల అవుతున్నసందర్భంలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో తన కుమారుడు నాగచైతన్య పెళ్లి పై నాగార్జున చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరిచాయి. మంచి రోజు కోసం గత రెండు నెలలుగా ఎదురు చూస్తూ ఉన్న నేపధ్యంలో మంచి రోజు కుదరడంతో అక్టోబర్ 17న విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు నాగ్.  ఇదే సందర్భంలో మరొక అడుగు ముందుకు వేసి తమ ‘మనం’ సినిమా కూడా మంచి రోజున విడుదలైందని అంటూ తనకు మంచిరోజు సెంటిమెంట్ ఎక్కువ అని అన్నడు నాగార్జున. ఈ సందర్భంలో తమ ‘లైలా’ గురించి చెపుతూ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని, ఫీల్ గుడ్ మూవీ అని నాగార్జున చెప్పుకొచ్చాడు.  అయితే ఈ మాటలు అన్ని విన్న మీడియా వారు నాగ చైతన్యకు తానూ ఇష్టపడే నిజమైన ‘లైలా’ తో పెళ్లెప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా తన పిల్లల పెళ్లి తన చేతిలోలేదని వారి పార్ట్‌నర్స్‌ను వాళ్లే వెతుక్కోవాలని నాగార్జున జోక్ చేయడంతో ఆ మీడియా సమావేశంలో నవ్వులు విరిశాయి.  అయితే నాగార్జున ఈ మాటలు యధాలాపంగా అన్నడా లేక చైతూ నిజంగానే నిజమైన ‘లైలా’ కోసం వెతుకుతున్నాడా అనే విషయం మరి కొద్ది రోజులలో తెలిసే అవకాసం ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: