యాపిల్ బుగ్గల బ్యూటీ హన్సిక పై తేనేటీగలు పగపట్టి హింసిస్తున్నాయని స్వయంగా హన్సిక మీడియాకు లీక్ చేసింది. తనను వెంటాడి తేనేటీగలు కుట్టడంతో తన చేతికి విపరీతమైన నొప్పి వచ్చిందని అయితే ఈ విషయం తాను నటిస్తున్న సినిమా యూనిట్ సభ్యులకు తెలిస్తే తన నిర్మాతకు నష్టం కలుగుతుంది న్న ఉద్దేశ్యంతో తన నొప్పిని తన పంటి బిగువన దాచుకున్నానని హన్సిక తన ట్విట్ లో తెలియచేసింది.  ప్రస్తుతం హన్సిక నటిస్తున్న తమిళ సినిమా ‘అంబల’ చిత్రీకరణ కోసం ఈ సినిమా యూనిట్ ఊటీలో ఒక పాటను చిత్రీకరిస్తూ ఉంటే ఒక చెట్టు పైన ఉన్న తేనె పట్టులోని కొన్ని తేనెటీగలు చెట్టుకు ఆనుకుని ఉన్న హన్సిక ఎడమ చేతికి గట్టిగా కుట్టాయని అయినా తాను పట్టించుకోకుండా ఆ సీన్ లో తన నటన పూర్తి చేసే వరకు ఆ నొప్పిని భరించాను అని చెపుతోంది హన్సిక.  ఆ తరువాత డాక్టర్ వద్ద ఇంజక్షన్ చేయించుకుని తన షూటింగ్ కోన సాగించిందట ఈ బ్యూటీ. చేతినిండా సినిమలహో ఎప్పుడు బిజీగా ఉండాలని తాను దేవుడికి కోరుకునే దానిని అని చెపుతూ ఈరోజు తన కోరిక దేవుడు తీర్చడమే కాకుండా వరస పెట్టి విజయాలు వస్తూ ఉండటంతో తనకు సినిమాలు తప్పించి మరే విషయం పైనా ధ్యాస లేదు అని చెపుతోంది ఈ యాపిల్ బుగ్గల చిన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: