అమీర్ ఖాన్ నటిస్తున్న ‘పికె' సినిమాకు సంబంధించి తానుకుడా అమీర్ ఖాన్ లా షాకింగ్ లుక్ లో కనిపించ బోతున్నాను అంటూ గత కొన్ని రోజులుగా ఈచిత్ర హీరోయిన్ అనుష్క శర్మ ప్రచారం చేస్తూ ఉండటంతో అభిమానులు ఏమేమో ఊహిoచుకుని కలలు కన్నారు.  అయితే నిన్న అనుష్క వేరే లుక్ లో కనిపించి చాలా మందికి నిరాశ పరిచింది. నిన్న విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లో నగ్నంగా కనిపిస్తుంది అనుకున్న అనుష్క మరోలా దర్శనమిచ్చింది. అందరికి షాక్ ఇస్తూ పోలీస్ డ్రెస్ ధరించి, రేడియోతో కనిపించింది. దీనితో అనుష్క నగ్న అందాలు చూద్దామని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది.  అనుష్క చాలా తెలివిగా తన అభిమానులను ఊరించి ఇలా షాక్ ఇచ్చినందులకు ఆమె అభిమానులు తెగ భాదపడి పోతున్నారని టాక్. సరికొత్త కాన్సెప్టుతో తీస్తున్న ఈ సినిమా పై ఇప్పటికీ చాలా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా పబ్లిసిటీ కోసం రకరకాల మార్గాలు అన్వేస్తున్న ఈరోజులలో ఈ సినిమా నిర్మాతలు అనుష్క శర్మను అడ్డం పెట్టుకుని గట్టి ప్లాన్ రచించి విజయవంతం అయ్యారు అనుకోవాలి.  ఈ సినిమా ద్వారా అమీర్ ఖాన్ కలలు గంటున్న 500 కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకోవడానికి ఇలాంటి మార్గాలు ఇంకా చాల అన్వేషించాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: