రజనీ అల్లుడు కోలీవుడ్ యంగ్ హీరో ‘వై దిస్ కొలవెరి’ పాటతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించాడు. విచిత్రమైన శైలిలో పాడి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ధనుష్. కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన ఇమేజ్ ను పెంచుకుంటున్న ధనుష్ అప్పుడప్పుడు బయట హీరోల సినిమాలకు పాటలు పాడుతూ హడావిడి చేస్తూ ఉంటాడు.  అయితే ఇప్పటి వరకు కేవలం తమిళ సినిమాలకే పాటలు పాడిన ధనుష్ ఒక కన్నడ సినిమా కోసం పాట్ పాడటం కోలీవుడ్‌ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న ‘వజ్రకాయ’ చిత్రం కోసం ధనుష్ పాడగా, ఇటీవల ఈ పాటను రికార్డ్ చేశారు.  శివరాజ్, ధనుష్ లు మంచి స్నేహితులు అవడంతో సరదాగా స్నేహితుడి కోసం పాడినప్పటికీ ఆ చిత్రనిర్మాతలు ధనుష్‌ పాడిన పాటకు డబ్బుతో విలువ కట్టలేక ఒక వాచ్ ని ఇచ్చి సరిపెట్టారు. అయితే ఆ వాచ్ విలువ అక్షరాల 4 లక్షలు కావడంతో ఇప్పుడది కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  జాతీయ స్థాయిలో పేరున్న గాయకులకు ఇచ్చే రేంజ్ లో ధనుష్ పాడిన పాటను విలువ కట్టడం చూస్తూ ఉంటే ధనుష్ క్రేజ్ కోలీవుడ్ లోనే కాకుండా శాoడిల్ వుడ్ లో కూడా ఎరేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: