సినీ నటుడిగా, దర్శకుడిగా పేరుగాంచిన తనికెళ్ల భరణిలో అందరికీ తెలిసిన ఒక సినీ రచయితగా మాత్రమే కాకుండా ఒక మంచి సంస్కారవంతమైన కవి కూడా ఉన్నాడు. భరణి రాసిన ఒక పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో విడుదల అవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా టాలీవుడ్ గౌరవాన్ని పెంచే సంఘటనగా మారింది. ‘ప్యాసా’ టైటిల్‌తో తనికెళ్ళ భరణి రచించిన ఈ పుస్తకం అక్కడ రిలీజయ్యేలా చూడడంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కీలకపాత్ర వహించగా, బ్రిటీష్ ఎంపీ డాన్‌బైల్స్, బ్రిటన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఇందుకు సహకరించారు అనే వార్తలు వస్తున్నాయి.  ప్రశాంతిరెడ్డి అనే తెలుగమ్మాయిని డాన్‌ బైల్స్ వివాహం చేసుకావడంతో ఈ బ్రిటీష్ పార్లమెంట్ సభ్యునికి తెలుగు వారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. ప్రముఖ ఉర్దూ కవి ఉమర్ ఖయ్యాం- ‘రుబాయత్ ’ పుస్తకం స్ఫూర్తిగా తనికెళ్ల భరణి ఈ ‘ప్యాసా’ పుస్తకాన్ని రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పుస్తకం ఆస్ట్రేలియాతో పాటు వివిధ దేశాలలో ఇప్పటికే విడుదలైంది.  ఒక తెలుగు రచయిత రాసిన పుస్తకం బ్రిటీష్ పార్లమెంట్‌లో ఆవిష్కరణ కావడం ఇదే ప్రప్రధమం అని అంటున్నారు. సినిమాలలో ఏ పాత్రనైనా అవలీలగా పోషించే భరణి రచయితగా కూడా రకరకాల విభాగాలలో అందివేసిన వ్యక్తిగా మారడం టాలీవుడ్ సినీ పరిశ్రమకు గౌరవంగా మారింది...   

మరింత సమాచారం తెలుసుకోండి: