మెగా బ్రదర్ నాగబాబు తనకన్నా ముందు పుట్టి ఉండి సినిమా రంగానికి ముందు వచ్చి ఉంటే తన కన్నా పెద్ద మెగా స్టార్ అయిపోయి ఉండేవాడని చిరంజీవి చేసిన కామెంట్లు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఈ మాటలు విన్న చాలామంది చిరంజీవికి తన తమ్ముళ్ళు అంటే ఎంత ప్రేమో అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.  ఇక ఈ విషయం వివరాలలోకి వెళితే మాటివిలో ప్రసారం అవుతున్న ‘సీతామహాలక్ష్మి’ సీరియల్ లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తూ విమర్శకుల మన్ననలను కూడా పొందుతున్న ఈ సీరియల్ యూనిట్ ను అభినందిస్తూ చిరంజీవి ఈ కామెంట్లు చేసాడు.  అంతేకాదు నాగబాబు మంచి నటుడనీ ఏ సీన్ అయినా చాల చక్కగా నటిస్తూ సున్నితంగా ఆ పాత్రలోకి ఒదిగి పోతాడనీ చిరంజీవి నాగబాబు పై ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే చిరంజీవి చేసిన ఈ పొగడ్తల పై అప్పుడే నెగిటివ్ కామెంట్లు కూడా మొదలయ్యాయి.  చిరంజీవికి తన తమ్ముడు నాగబాబు అంటే ఇష్టం ఉన్న అభిప్రాయాన్ని ఇంత అతిగా పొగడాలా అంటూ కామెంట్లు వినపడటమే కాకుండా చిరంజీవి నాగబాబు పై చేస్తున్న ఈ అతి పొగడ్తల వెనుక ఏదో వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అంటూ అప్పుడే కొంతమంది చిరంజీవి పై సెటైర్లు వేస్తున్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: