సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత ఫుల్ జోష్ లో ఉంది. తను టాలీవుడ్ లో నటించిన అన్ని మూవీలు గ్రాండ్ సక్సెస్ ని సాధించడటం, అలాగే కోలీవుడ్ లోనూ తను తాజాగా నటించిన కత్తి చిత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్ తో బాక్సాపీస్ ని షేక్ చేయడంతో సమంత తెగ హ్యాపీ మూడ్ లో ఉంది. ప్రస్తుతం సమంతకి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే టాలీవుడ్ నుండి సైతం సమంతకి ఆఫర్స్ వెల్లువులా వస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత, తాజాగా సీనియర్ హీరోయిన్స్ ని టార్గెట్ చేసుకుంటూ ఓ స్టేట్ మెంట్ చేసిందట. సమంత చేసిన కామెంట్స్ కి టాప్ హీరోయిన్స్ అంతా కోపంతో ఊగిపోతున్నారు. తిరిగి సమంతకి కౌంటర్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ సమంత చేసిన కామెంట్ ఏంటంటే, "వయసు మీద పడుతున్న సీనియర్ హీరోయిన్స్ ఎంత త్వరగా పెళ్ళి చేసుకుంటే అంత మంచిదంటూ" సలహా ఇచ్చింది. అంతే కాకుండా "తను కూడ 30 సంవత్సరాల వయసుకి రాగానే పెళ్ళి చేసుకుంటానని," పెళ్ళి తరువాత తన భవిష్యత్ కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందో, ఆ విషయాలను సైతం వెల్లడింది. ఇందులోని భాగంగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మరో క్రేజీ హీరోయిన్ అయిన అనుష్క ని టార్గెట్ చేసుకొని, సమంత ఈ విధమైన కామెంట్ చేసినట్టుగా కోలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో వయసు మీద పడుతున్న హీరోయిన్స్ అంటూ కామెంట్ చేసిన వారిలో అనుష్క కూడ ఉన్నట్టు కోలీవుడ్ కథనాలు తెలుపుతున్నాయి. విషయం తెలుసుకున్న అనుష్క, సమంత పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్, కోలీవుడ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావడం అనుష్కకి ప్లస్ పాయింట్ అయింది. అయితే సమంత చెబుతున్న మాటల ప్రకారం అనుష్కకి వయసు మీద పడటం కారణంతోనే ఈ తరహా పాత్రలు వచ్చాయని కోలీవుడ్ కథనాల ప్రకారం తెలుస్తుంది. మొత్తంగా సమంత కామెంట్ చేసిన మాటలకు సీనియర్ హీరోయిన్స్ నుండి ఏ విధమైన కామెంట్స్ వస్తాయో అని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: