అచ్చమైన తెలుగు టైటిల్స్ తో వస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉండటంతో అటువంటి ప్రయోగాన్ని మహేష్ బాబు చేయబోతున్నాడు అని తెలుస్తోంది. మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమాకు ‘మా అక్క బంగారం’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ టైటిల్ ఆలోచనలను ఈ సినిమా దర్శక నిర్మాతలు తమ సన్నిహితులతో చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా కధ సిస్టర్ సెంటిమెంట్ తో ఉండబోతోంది అని టాక్. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో అత్తగా కనిపించిన నదియా ఈ సినిమాలో మహేష్ కు అక్కగా నటిస్తోంది. ఇంతకు ముందు ఈ సినిమాకు ‘మగాడు’ అనే టైటిల్ ను ను అనుకున్నా సినిమా పై ఎటువంటి భారీ అంచనాలు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఇటువంటి సాఫ్ట్ టైటిల్ ను ఈ ఫిలిం యూనిట్ ఆలోచిస్తోంది అని సమాచారం.  శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ అందించే పాటలు ఈ సినిమాకు గుండెకాయగా మారుతాయి కాబట్టి ఈ సినిమా పాటల ట్యూన్స్ విషయంలో దేవిశ్రీప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఫిలిం యూనిట్ వర్గాల సమాచారం. మహేష్ గత పరాజయాల నేపధ్యంలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కుటుంబ అనుభంధాలను మిళితం చేస్తూ టోటల్ కమర్షియల్ ఫార్మెట్ లో నడిచే కథ ఇది అని అంటున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఈ నెల 30 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు అని, అదేవిధంగా నవంబరు 3 నుంచి మహేష్‌బాబు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: