పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత మూవీలని ఒప్పించటానికి నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా నిర్మాతలు, పవన్ కళ్యాణ్ తో మూవీ తీయటాని కోసం చేయని ప్రయత్నం ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం నిర్మాతలకి అందని ద్రాక్ష లాగా కనిపిస్తుంటాడు. ఒక వేళ నిర్మాతలకి అ అవకాశం వస్తే, ఇంట్లో కనక వర్షమే అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్టార్ డం ఇలా నడుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ నిర్మాత పవన్ కళ్యాణ్ తో ఓ కథని ఒప్పించటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గా దీపావళికి తమిళ నాట విడుదలైన 'కత్తి' చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకూ ఈ మూవీ భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ కాకుండా, రీమేక్ చేయాలన్న ఆలోచనతో తెలుగు వెర్షన్ నిర్మాత ఠాగూర్ మధు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంపై ఠాగూర్ మధు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరిపాడు. కాని పవన్ కళ్యాణ్ చూద్ధాం అన్నట్టు సమాధానం చెప్పాడు కాని, ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. వ్యవసాయదారుల సమస్యల ఇతివృత్తంతో రూపొందిన సినిమా కావడంతో దీనిని పవన్ కల్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తే ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుందనీ, ఈ పాత్ర ఆయనకు టైలర్ మేడ్ వంటిదనీ నిర్మాత భావిస్తున్నాడు. మొదటి సారి జరిగిన చర్ఛలో పవన్ కళ్యాణ్ నుండి అంతగా స్పందన రాకపోవడంతో, మరో సారి పవన్ కళ్యాణ్ తో చర్ఛలు జరిపాడు నిర్మాత. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఆ మూవీని తెలుగులో చేయటానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి తను పూర్తి చేయవలసిన మూవీలు ఉన్నాయి. అవి పూర్తయ్యాక ఆ మూవీపై ఆలోచిద్ధాం అంటూ క్లారిటి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన సమాధానంతో ఈ విషయం ఇప్పట్లో తేలేది కాదంటూ, నిర్మాత కామ్ అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: