నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. తాను వచ్చి 8 ఏళ్ళు దాటిపోయినా తనకంటూ ఒక స్టైల్ ఎందుకు ఏర్పరుచు కోలేదు అని ఆ ఛానల్ అధిపతి ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అడిగిన ప్రశ్న పై స్పందిస్తూ ఒక ఆ శక్తికర విషయాన్ని తన మనసులోది బయట పెట్టాడు.  తనతో సినిమాలు తీసిన వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి చాలామంది దర్శకులు తాను నటిస్తున్న సినిమాలోని ఒక సన్నివేశాన్ని వివరించి ఆ సీన్ లో చిరంజీవి అయితే ఇలా చేసేవారు అని చెపుతూ ఉండటంతో తాను తనకు తానుగా ఆలోచించడం మానేసి దర్శకులు ఎలా అడుగుతున్నారో అలా చేశాననీ అంటూ దానివల్ల తనకంటూ ఒక స్టైల్ ఏర్పడలేదని చెప్పుకోచ్చాడు చరణ్. ఇప్పుడిప్పుడే ఆ మెగా ముద్ర నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ తనతో సీన్ చేయించుకునే దర్శకులతో వారికి ఏమి కావాలో అడగమంటూ తన తండ్రి ప్రస్తావన లేకుండా ఆ సీన్ తన స్థాయిలో ఎలా చేస్తే బాగుంటుందో అనే విషయం పై ఆలోచిస్తూ మెగా ముద్ర నుండి బయటకు రావడానికి తన సాయిశక్తులా కృషి చేస్తున్నానని అంటూ, ఆ ముద్ర నుండి బయటకు రావడానికే తాను నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ టైటిల్స్ లో మెగా పవర్ స్టార్ అనే పదం వాడకుండా జాగ్రత్త పడితే మీడియా దానికి వేరే అర్ధాలు రాసింది అని చెప్పాడు రామ్ చరణ్.  ఇదే సందర్భంలో చరణ్ దాసరి నారాయణ రావు పరోక్షంగా తమ కుటుంబాన్ని, తనను విమర్శించడం పై చాల ఆచితూచి స్పందించాడు. ఓ పెద్ద హీరో మూవీ కోసం ఓ చిన్న హీరో మూవీని ఓ థియేటర్ నుంచి తీసేశారని దాసరి అన్న మాటల పై స్పందిస్తూ ఆయన తన పేరుతో ఏదైనా వ్యాఖ్యానిస్తే తాను స్పందిస్తానని, కాని తన పేరు చెప్పకుండా అన్యాపదేశంగా మాట్లాడితే తాను ఏమి రియాక్ట్ అవుతానని అంటూ నిజంగా అయన ఒక లెజెండ్ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు చరణ్..   

మరింత సమాచారం తెలుసుకోండి: