గతవారం దీపావళికి విడుదల అయిన కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ‘కత్తి’ ఎన్ని వివాదాలు చుట్టు ముట్టినా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజులలో ఈ సినిమా 30 కోట్లు వసూలు చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఇచ్చిన సూపర్ హట్ ఆనందంతో చెన్నైలోని హీరో విజయ్ అభిమానులు చెన్నైలోని వెట్రీ ధియేటర్ లో విజయ్ రూపంలో ఒక మైనపు విగ్రహాన్ని తాయారు చేయడమే కాకుండా ఆ బొమ్మకు సినిమా ప్రదర్శిస్తున్న నాలుగు షోల సమయాలలోనూ పాలాభిషేకాలు చేస్తూ కొబ్బరికాయలు కొడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు.  ఈ సినిమాకు కోలీవుడ్ లో రోజురోజుకూ పెరిగి పోతున్న క్రేజ్ ను బట్టి ఈ సినిమా 100 కోట్ల సినిమాగా మారినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. వ్యవసాయదారుల సమస్యల ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమా కథ తమిళ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.  ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఇమేజ్ కు పూర్తిగా సరిపోయే ఈ సినిమా కథను తెలుగులో రీమేక్ చేయడానికి ఎదోవిధంగా ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుకున్న ‘ఠాగూర్’ మధు ద్వారా పవన్ విజయ్ పై తన ఒత్తిడిని మరింత పెంచాడు అనే వార్తలు మరింత ఊపు అందుకున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: