ఈ మధ్య కాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన బ్లాక్ బస్టర్ మూవీలను బిటౌన్ లో రిమేక్ చేయడం అనేది చాలా కామన్ గా మారింది. ఆ విధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సాధించిన చాలా ఫిల్మ్స్, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిమేక్ అయ్యాయి. బాలీవుడ్ లోని బడా హీరోలు సైతం సౌత్ ఫిల్మ్ రిమేక్ లపై ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్ ల మోత మ్రోగించిన అత్తారింటికి దారేది మూవీని బాలీవుడ్ లో రిమేక్ చేయాలని ఓ నిర్మాత తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన హిందీ రిమేక్స్ ని ఓ నిర్మాత కైవసం చేస్తున్నాడనే న్యూస్ తెలుస్తుంది. అయితే తెలుగులో అత్తారింటికి దారేది మూవీలో నటించింది పవన్ కళ్యాణ్. అలాగే బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తే మూవీ బాక్సాపీస్ ని షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు. అందుకే ఈ తరహా కథలు షారుఖ్ ఖాన్కిని సరిగ్గా సూట్ అవుతాయని ఓ నిర్మాత అప్రోచ్ అయితే, అందుకు షారుఖ్ ఖాన్ తను అత్తారింటికి దారేది మూవీని రిమేక్ లో నటించను అని క్లారిటిగా చెప్పాడంట. తరువాత ఆ స్టోరి మరో ఇద్దరి హీరోల వద్దకు వెళ్ళి, చివరికి అక్షయ్ కుమార్ వద్దకు వచ్చి ఆగింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ నటించే అవకాశం ఉన్నట్టుగా బిటౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఫ్యామిలీ డ్రామాలను అద్భుతంగా పండించగల హీరో అక్షయ్ కుమార్. అత్తారింటికి దారేది వంటి స్టోరికి అక్షయ్ కుమార్ సరిపోతాడని బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీలను పూర్తి చేసుకున్న తరువాత ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన దానిపై అఫిషియల్ స్టేట్ మెంట్ అవకాశం ఉందని అక్షయకుమార్ టీం నుండి వినిపిస్తున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: