బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేయటానికి ఆసక్తి చూపుతుంది. ఇప్పటి వరకూ కత్రినాకైఫ్, ప్రియాంక చోప్ర, కరీనాకపూర్ వంటి హీరోయిన్స్ చేసే ఐటెం సాంగ్స్ కి భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు వీరి సరసన మరో గ్లామరస్ హీరోయిన్ చేరుతుంది. తనే గ్లామర్ డాల్ అనుష్క శర్మ. ఇప్పటి వరకూ అనుష్క శర్మ ఐటెం సాంగ్ ని ఎక్కడా చేయలేదు. గతంలో తనకి ఐటెంసాంగ్ ఆఫర్స్ వచ్చినా, వాటిని చేయనంటూ తిరస్కరించింది. ఇప్పుడు మాత్రం తన వద్దకు వచ్చిన ఐటెం సాంగ్ ని కాదనకుండా చేస్తుంది. అయితే తను మొదటి సారిగా చేస్తున్న ఐటెం సాంగ్ కావడంతో రెమ్యునరేషన్ ని సైతం భారీగానే డిమాండ్ చేస్తుంది. దాదాపు 2 కోట్ల రూపాయల వరకూ అనుష్క శర్మ ఈ సాంగ్ కోసం రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. ఈ సాంగ్ లో తను హాట్ ఎక్స్ పోజింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పొడవు కాళ్ల సుందరి అనుష్కా శర్మ ‘దిల్ ధడక్‌నే దో’ చిత్రంలో తొలిసారిగా ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుంది. రణవీర్‌సింగ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ చే ఈ ఐటెమ్ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ పాటలో ప్రియూంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, షెఫాలీ షా కూడా కనిపించనున్నారు. గతంలో రణ్ భీర్ కపూర్ తో డేటింగ్ చేసిన అనుష్క శర్మ, ఇప్పుడు ఏకంగా రణ్ భీర్ కపూర్ మూవీలోనే ఐటెం సాంగ్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తను ఈ ఐటెం సాంగ్ ని చేయటానికి కూడ కారణం రణ్ భీర్ కపూరే అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: