వినాయక చవితికి సందడి చేసి టాలీవుడ్ రికార్డులను తిరగ రాద్దామని ప్రయత్నించిన జూనియర్ ‘రభస’ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించడంతో ఘోరమైన ఫ్లాప్ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆశక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.  చాలామంది అనుకుంటున్నట్లుగా జూనియర్ ‘రభస’ ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ కు నష్టాలు తెప్పించ లేదు సరికదా లాభాల పంట పండించింది అని కొoదరు విశ్లేషకులు ఒక కొత్త విషయాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. సుమారు 35 కోట్లు ఖర్చుతో తీసిన ‘రభస’ సినిమాను ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ చాల తెలివిగా 47 కోట్లకు మార్కెట్ చేసి విడుదలకు ముందే ఈ సినిమాపై లాభాలు అందుకున్నాడని టాలీవుడ్ విశ్లేషకుల అంచనా. అయితే ఈలాభాలు అన్నీ కూడా బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనుని హీరోగా చేసితీసిన ‘అల్లుడు శీను’ సినిమా నిర్మాణ ఖర్చుల నిమిత్తం ఈసినిమా మార్కెట్ కాకపోవడంతో తానే స్వయంగా విడుదల చేసుకోవడం వల్ల ‘రభస’ లో వచ్చిన లాభాలు ‘అల్లుడు శీను’ లో కరిగి పోయాయి అని ఒక వాదాన్ని విశ్లేషకులు చేస్తున్నారు. అదీకాకుండా పబ్లిసిటీ విషయంలో కూడా కోట్ల రూపాయలు ‘అల్లడు శీను’ సినిమాపై మితిమీరిన విశ్వాసంతో ఖర్చు పెట్టిన బెల్లంకొండ వ్యాపారపు ఎత్తుగడ జూనియర్ ‘రభస’ లాభాలను ఇచ్చినా బెల్లంకొండను సమస్యలలో ముంచెత్తి వేసింది అనే విశ్లేషణలు వినపడుతున్నాయి.  జూనియర్ ఇమేజ్ తో ‘రభస’ ఫ్లాప్ అయినా బెల్లంకొండ లాభాలతోనే బయటకు వచ్చాడు అని ఇప్పుడు ఫిలింనగర్ లో వినపడుతున్న ఈసరి కొత్త గాసిప్పుల వెనక జూనియర్ ను అభిమానించే కొందరు నిర్మాతల ఎత్తుగడ ఉంది అనే ప్రచారం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: