సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రజినీకాంత్ రికార్డులను హీరో విజయ్ తన ‘కత్తి’ తో బ్రేక్ చేసిన నేపధ్యంలో రజినీ తన ‘లింగా’ సినిమా ద్వారా ఎటువంటి సమాధానం ఇస్తాడో అనే ఆ శక్తితో రజినీ అభిమానులే కాకుండా కోలీవుడ్ సినిమా రంగం ఎదురు చూస్తోంది.  రజినీకాంత్ పుట్టినరోజునాడు డిసెంబర్ 12న విడుదలకు సిద్దo అవుతున్న ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈమధ్యనే రామోజీ ఫిలిం సిటీలో మూడున్నర కోట్ల భారీ ఖర్చుతో రెండు వందల మంది డాన్సర్స్ తో చిత్రీకరించిన ఒక పాట సూపర్ స్టార్ అభిమానులను ధియేటర్లు అదిరిపోయేలా అభిమానులచేత ఈలలు వేయిస్తుంది అని అంటున్నారు.  దీనికి కారణం ఈ పాటలో రజినీ ఈ సినిమా హీరోయిన్ సోనాక్షితో వేసిన స్టెప్స్ అని అంటున్నారు. నేటి యంగ్ హీరోలకు సవాల్ విసిరేలా ఈ సినిమాలో రజినీ లుక్ ఉండటమే కాకుండా ఈ సినిమాలో రజినీకాంత్ వేస్తున్న స్టెప్స్ చాల విభిన్నంగా ఉంటాయని టాక్.  ప్రస్తుతం దుబాయ్, అబుదాబీలలో ఈ సినిమా హీరోయిన్స్ తో పాటల చిత్రీకరణలో పాల్గొంటున్న రజినీ ఉత్సాహాన్ని చూసి ఫిలిం యూనిట్ వారే కాకుండా ఆ షూటింగ్ ను చూడటానికి వచ్చిన విదేశీయులు కూడా ఆశ్చర్య పడుతున్నారని టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: