నేటి యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మారకద్రవ్యాల సమస్యకు వ్యతిరేకంగా కోయంబత్తూరులోని అమృతా స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విద్యార్థులు చేపట్టిన యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ కు తన మద్దతు తెలుపుతూ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఒక ప్రకటనను విడుదల చేసాడు.  ‘ఉన్నత స్థానానికి తారలుగా ఎదగండి డ్రగ్స్ బారిన పడకండి’ అంటూ ఒక స్పూర్తి దాయకమైన స్లోగన్ తో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి తన వంతు బాధ్యత కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ సంవత్సరం జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘ఐయామ్ దట్ ఛేoజ్’ షార్ట్ ఫిలింలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.  నేటి తరానికి సామాజిక బాధ్యతలను గుర్తి చేసి ఆ షార్ట్ ఫిలిం ద్వారా ప్రశంసలు అందుకున్న బన్నీ మళ్ళీ తన సామజిక స్ప్రహను డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా తనలోని సామజిక చైతన్యాన్ని నేటి యువతరానికి తెలియచేస్తున్నాడు.  ఒక వైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా కొన్ని మంచి కార్యక్రమాల పట్ల బన్నీ చూపెడుతున్న ఆశక్తి నేటి తరం యంగ్ హీరోలలో ఒక ప్రత్యేక స్థాన్నాన్ని బన్నీకి ఏర్పరుస్తుంది అని భావించడంలో సందేహం లేదు...   

మరింత సమాచారం తెలుసుకోండి: