సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డంని క్రియేట్ చేసుకున్న కొరియోగ్రాఫర్, రాఘవ లారెన్స్. అలాగే గత కొంత కాలంగా రాఘవ లారెన్స్ కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, దర్శకుడిగానూ, మ్యూజిక్ దర్శకుడిగానూ కూడ రాణిస్తున్నాడు. అయితే తను తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బక్సాపీస్ వద్ద అంతగా సక్సెస్ ని సాధించడం లేదు. తనే హీరోగా నటిస్తూ, సొంత దర్శకత్వంలో వస్తున్న ముని సీక్వెల్స్ మాత్రమే రాఘవ లారెన్స్ కి పేరుని తెచ్చి పెడుతున్నాయి. ఇదిలా ఉంటే అన్ని విభాగాలలో ప్రవేశంవున్న లారెన్స్ ఇప్పుడు బిల్డర్ అవతారమెత్తాడు. ఆయన మాతృముర్తికి జ్ఞాపకార్ధంగా చెన్నై శివార్లలో ఒక గుడిని కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మకు మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచి, పెద్ద చేసిన తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాంటి అమ్మ జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆమె ప్రతి రూపాన్ని ఆలయంలో ప్రతిష్టించి పూజించుకోవాలనుకంటున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత రాఘవ లారెన్స్. దీనికి సంబంధించి బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లికి గుడి కట్టించడానికి శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా లారెన్స్ మీడియాకి ఓ ప్రకటన విడుదల చేస్తూ, తన తండ్రి పుట్టిన ఊరు చెన్నై పూందమల్లి సమీపంలోని మెవలూర్‌కుప్పంలో కొంత స్థలాన్ని సేకరించి అమ్మకు ఆలయాన్ని కట్టించనున్నట్లు తెలిపారు. అమ్మ విగ్రహాన్ని రాజస్థాన్‌లో తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అమ్మ వడే ఆలయం అని తన తల్లి జీవించి ఉండగానే ఆమెకు గుడి కట్టించాలని ఆశించానన్నారు. తనను పెంచడానికి తల్లి పడ్డ కష్టాలను ఒక పుస్తక రూపంలోకి తెచ్చి వచ్చే ఏడాది తనపుట్టిన రోజు నాడు ఇదే ఆలయంలో ఆవిష్కరించనున్నట్లు రాఘవ లారెన్స్ వెల్లడించాడు. తమిళనాడులో మనుషులకు గుడికట్టడం అన్నది సర్వసాధారణ విషయం. కుష్బూ, జ్యోతిక వంటి నటీమనులకు అభిమానులు ఏనాడో గుళ్ళు కట్టేశారు. ఈ గుడి నిర్మాణంతో లారెన్స్ మరింత క్రేజ్ ని సంపాదించుకుంటున్నాడు. ముని 3 సినిమాలో లారెన్స్ బిజీగా వున్న సంగతి తెలిసినదే

మరింత సమాచారం తెలుసుకోండి: