యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నట్టగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా జూనియర్ నటిస్తున్న మూవీలు బాక్సాపీస్ వద్ద సరైన సక్సెస్ ని సాధించలేక పోతున్నాయి. తను ఎంచుకున్న కథలు కాని, దర్శకులు చూపించే తీరు కాని బాక్సాపీస్ వద్ద జూనియర్ కి సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోతున్నాయి. దీంతో ఈ యంగ్ టైగర్ కథల విషయంలో మరింత శ్రద్ధ చూపుతున్నాడు. గతంలో తను సక్సెస్ కావడానికి ఎటువంటి ఫార్ములాని ఉపయోగించాడో, ఇప్పుడు కూడ అదే బాటలో పయనిస్తున్నాడు. సక్సెస్ కోసం తపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు కథలనే కాకుండా నిర్మాతలను కూడా ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం దిల్ రాజు మంచి కథ కోసం వెతుకుతున్నాడట. గతంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాక్సాపీస్ వద్ద లాభాల పట్టింది. అయితే ఆ తరువాత వచ్చిన రామయ్య వస్తావయ్యా మూవీ మాత్రం ఆశించినత సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. దిల్ రాజు, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వస్తన్న ప్రాజక్టుకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశం వుందని అంటున్నారు. ఎన్టీఆర్ కి సూటయ్యే మంచి సబ్జెక్టు తయారుచేసి, భాస్కర్ ఇప్పటికే దిల్ రాజు కి చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భాస్కర్ సైతం గత కొంత కాలంగా ఓ మంచి కథని రెడీ చేసుకొన్నాడని, ఆ స్టోరిని త్వరలనే జూనియర్ కి వినిపించే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: