చిరంజీవి నటించబోయే 150 సినిమాకు సరైన దర్శకుడు, సరైన కథ దొరకక ఆలస్యం జరుగుతోంది అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయాన్ని చిరంజీవి కూడా అనేక సార్లు బహిరంగంగానే చెప్పాడు. అయితే చిరూ 150వ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడడానికి ఒక ప్రముఖ నేపాల్ జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా వల్లే ఈ ఆలస్యం జరుగుతోంది అంటూ ఒక ఆశక్తికర గాసిప్ ఫిలింనగర్లో హడావిడి చేస్తోంది.  వినపడుతున్న ఈ వార్తల ప్రకారం చిరంజీవి గత ఆగష్టులో తన పుట్టినరోజును నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయంలో తన పుట్టినరోజును జరుపుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంలో అక్కడి ప్రముఖ నేపాలీ జ్యోతిష్కులను కలిసి తన 150వ సినిమా ప్రారంభానికి మంచి ముహూర్తం పెట్టమని కోరాడట చిరంజీవి.  అయితే చిరంజీవి జాతకం పరిశీలించిన ఆ జ్యోతిష్కులు నవంబర్ పూర్తి అయ్యే వరకు ఎటువంటి కొత్త పనులకు సంబంధించిన ప్రాజక్టులను ప్రారంభించ వద్దని కార్తీకమాసం అంతా శివుడిని ఆరాధించిన తరువాత డిసెంబర్ నెలలో 150వ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన చేయమని సలహా ఇచ్చారట ఆ నేపాలీ జ్యోతిష్కులు.  ఈ సలహాతోనే చిరంజీవి తన 150వ సినిమాకు సంబంధించిన పనులు అన్నింటినీ వాయిదా వేయడమే కాకుండా తన ఇంటికి ఆ జ్యోతిష్కులు సూచించిన విధంగా వాస్తు విషయంలో భారీ మార్పులు చేస్తున్నాడు అనే టాక్ కూడా ఉంది. ఈ సెంటిమెంట్ రీత్యానే కాబోలు భాగ్యనగరంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ఛానల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొని సందడి చేసాడు. వినపడుతున్న ఈ గాసిప్పుల ప్రకారం చిరంజీవి తన 150వ సినిమా అధికారక ప్రకటన డిసెంబర్ లో జరుగుతుంది అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: