గ్లామర్ బ్యూటీగా పేరుగాంచిన నయనతార తాను చేసే పాత్ర విషయంలో చాల శ్రద్ధ తీసుకుంటుంది అనే పేరుంది. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్రలో మెప్పించిన నయనతారను చూసిన తరువాత, విమర్శకులు కూడా తాము చూస్తున్నది నిజంగానే ఆ నయనతారేనా? అంటూ ఆశ్చర్యపోయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం తెలుగులో కన్నా కోలీవుడ్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టిన నయన్ జయంరవితో చేస్తున్న సినిమా ఇప్పుడు కోలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న నయనతార ఈ సినిమా పాత్ర కోసం హార్స్ రైడింగ్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ‌తోపాటు మరికొంతమంది మహిళా మాజీ ఐపీఎస్ అధికారులను కలిసి తాను నటించబోతున్న సినిమాలోని పాత్ర గురించి వారి సలహాలు తీసుకోవడమే కాకుండా నడక దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఒక రియల్ పోలీస్ ఐపిఎస్ ఆఫీసరుగా కనిపించడానికి భారీ కసరత్తు చేస్తూ ఈ సినిమాలోని తన నటన ద్వారా జాతీయ అవార్డు పై కన్నేసింది అనే వార్తలు వస్తున్నాయి.  కొన్ని సినిమాలలో గ్లామరస్ ఎక్స్ పోజింగ్ చేస్తూ మరికొన్ని సినిమాలలో తన టాలెంట్ ను చూపెడుతూ విజయవంతంగా మూడు పదులు వయసు దాటిపోయినా నయనతార హవా కొనసాగుతూనే ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: