పారిశ్రామిక దిగ్గజం అనిల్‌ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు వెండితెర మన్మధుడు నాగార్జున తన కుటుంబ సభ్యులతోసహా గత ఆదివారం 'స్వచ్ఛభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మోడీ పిలుపు ఇచ్చిన ఈ సేవా కార్యక్రమానికి ప్రతిస్పందించిన మొట్టమొదటి టాలీవుడ్ సెలిబ్రిటీగా నాగ్ క్రియేట్ చేసాడు. అంతడితో ఊరుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళమని అల్లుఅర్జున్ ను నామినేట్ చేసి బన్నీకి షాక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అల్లుఅర్జున్ ఈ సవాల్ ను స్వీకరిస్తాడా? లేదా? అనే విషయం పై అందరి ద్రుష్టి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో మంత్రిగా పనిచేసిన చిరంజీవి అనుమతిని ఈ విషయంలో బన్నీ అడుగుతాడా లేదంటే రాజకీయాలతో సంబంధం లేకుండా తనకున్న సామాజిక చైతన్యంతో తన అభిమానులతో ఈ ‘స్వచ్ భారత్’ కార్యక్రమాన్ని కొనసాగిస్తాడా అనే విషయం పై మరి కొద్ది రోజులలో క్లారిటీ వచ్చే అవకాసం ఉంది. మెగా అభిమానులే బన్నీ అభిమానులు కాబట్టి బన్నీ నాగ్ విసిరిన ఈ సవాల్ స్వీకరిస్తే మెగా అభిమానులు కూడా మోడీ ప్రభావంలో అడుగులు వేస్తున్నారనే అనుకోవాలి. ఈ సంవత్సరం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా బన్నీ నటించిన ‘రేసుగుర్రం’ ఇచ్చిన ఆనందంతో సినిమాలు చేస్తున్న బన్నీ నాగార్జున ఇచ్చిన సవాల్ ను స్వికరిస్తే టాలీవుడ్ యంగ్ హీరోలలో సామజిక చైతన్యం ఉన్న హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేస్తాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: