మొదటి నుంచీ దగ్గుబాటి రానా ఇటు తెలుగు సినిమాలతో బాటు, అటు హిందీ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు.అయితే, ఇటీవలి కాలంలో 'బాహుబలి', 'రుద్రమదేవి' వంటి భారీ చిత్రాలలో ఇరుక్కుపోవడం వల్ల హిందీ చిత్రాలు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తను ఓ బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పాడు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే 'బేబీ' సినిమాలో రానా కీలకమైన పాత్ర పోషిస్తాడనే విషయం తెలిసందే. 'వెన్స్ డే', 'స్పెషల్ చబ్బీస్' వంటి చిత్రాలను రూపొందించిన నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహిస్తాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. దగ్గుబాటి రానాకి సంబంధించి సీన్స్ పై షూటింగ్ కూడ జరుగుతుంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి ఈ బేబీ మూవీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, తాప్సీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా, అక్షయ్ కుమార్ లకి సీన్స్ షూటింగ్ జరుగుతుంది. గతంలో రానా బాలీవుడ్లో తెరకెక్కిన ‘దమ్ మారో దమ్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్లో కెరీర్ మొదలు పెట్టిన రానా అక్కడ నిలదొక్కుకోలేక పోయినా....అప్పుడప్పుడు పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దీంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రానా తెలుగులో ‘బాహుబలి', ‘రుద్రమదేవి' లాంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వంలోవస్తున్న ఈ బేబీ సనిమా వచ్చే ఏడాది జనవరి 23న రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: