జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న సినిమా బాద్ షా. నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ‘దూకుడు’ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాద్ షా టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ చెప్పిన ‘బాద్ షా డిసైడ్ అయితే, వార్ వన్ సైడ్ అయిపొద్ది’ అనే డైలాగ్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ఇప్పుడు బాద్ షా సమ్మర్ సీజన్ లో విడుదల అవ్వడానికి డిసైడ్ అయ్యాడని, కాబట్టి మిగిలిన సినిమాలన్నీ మరో సీజన్ చూసుకోవల్సిందేనని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: