ఈ మధ్య రజనీకాంత్ రాజకీయ ప్రవేశం పై మీడియాలో విపరీతంగా వార్తల హడావిడి జరుగుతూ ఉండటంతో నిన్న చెన్నైలో తన ‘లింగ’ కు సంబంధించి మరొక టీజర్ లాంచింగ్ లో ఈవిషయమై ఒక క్లారిటీ ఇవ్వడమే కాకుండా రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు రజనీ.  రాజకీయాలన్నవి ఊబిలాంటివని, అత్యంత ప్రమాదకరమైనవని అంటూ ఎన్నికల్లో గెలిచినా ప్రజలకు మంచి చేస్తామని చెప్పలేమన్నాడు సూపర్ స్టార్. 'నేను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేను కానీ ఏ విషయాన్నీ కాలమే నిర్ణయిస్తుంది' అంటూ తన రాజకీయ ప్రేవేశ వార్తలకు తాత్కాలికంగా తెరదించినా తెలివిగా మరింత పొడిగించాడు రజినీకాంత్.  ఈ కార్యక్రంలో పాల్గొన్నఈ సినిమా దర్శకుడు రవికుమార్ దగ్గర నుంచి అనేకమంది రజనీ అభిమానులు ‘సూపర్ స్టార్ రాజకీయాలలోకి రావాలి’ అంటూ పిలుపు నివ్వడంతో రజినీ ఈవిధంగా స్పందించాడు. ఈ ఫంక్షన్ లో ఈసినిమాకు సంబంధించి మరొక ఆశక్తికర విషయం బయటకు వచ్చింది. రజినీ ప్రస్తుతం నటిస్తున్న ‘లింగ’ టైటిల్ గతంలో అతడి అల్లుడు ధనుష్ కోసం రిజిస్టర్ చేసిందట. అయితే తన మామగారి కోసం ధనుష్ త్యాగం చేసాడు అని చెప్పడమే కాకుండా ధనుష్ తో ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న దర్శక నిర్మాతలను వేదిక పైకి పిలిచి రజినీ వారిని సత్కరించడం ఈ కార్యక్రమంలో మరో ట్విస్ట్.    

మరింత సమాచారం తెలుసుకోండి: