సినిమాలలో నటిస్తూ తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సమంత గతవారం జరిగిన చిల్డ్రన్స్ డే సందర్భంగా అనాథ పిల్లలకు బట్టలు స్వీట్స్ ఇచ్చే సేవా కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ పిల్లలతో కొంతసేపు గడిపింది. ఈకార్యక్రమం పూర్తి అయినతరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత వీరాభిమాని ఒకడు సమంత దగ్గరకు వెళ్ళి ఆమె అంగీకరిస్తే తన ఇంటి నుండి తన అభిమాని హీరోయిన్ కోసం ఫుడ్ తీసుకు వస్తానని చెప్పాడట. అయితే ఆ మాటలు విన్న సమంత శ్రమపడి తనకు భోజనం ఇక్కడకు తీసుకు రావడం ఎందుకు తానే ఆ అభిమాని ఇంటికి వెంటనే వస్తాను అని చెప్పి షాక్ ఇచ్చింది. అనుకోని ఈ సమాధానానికి షాక్ అయిన ఆ అభిమాని తన ఇల్లు అంత బాగుండదు అని చెప్పినా వినిపించుకోకుండా సమంత ఆ వీరాభిమాని ఇంటికి వెళ్ళడమే కాకుండా అతడి కుటుంబ సభ్యులకు బహుమతులు కూడా ఇచ్చి వారు పెట్టిన భోజనాన్ని ఆనందంతో తిన్నదట ఈ క్యూట్ హీరోయిన్. అంతేకాదు ఆ అభిమాని కుటుంబ సభ్యులతో తాను తీయించుకున్న ఫోటోను తన ఫేస్ బుక్ లో పెట్టి హడావిడి చేస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: