ప్రస్తుతం ఫిలింనగర్ లో ఎక్కడ విన్నా పవన్ రెండో హీరోయిన్ చర్చలే వినిపిస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్2’ సినిమాకు హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ఎంపిక కావడంతో ఇక ఈ సినిమాకు హీరోయిన్ కస్టాలు తీరినట్లే అనుకున్నారు అంతా. ఇప్పుడు ఈ సమస్య తీరి ఈ సినిమా యూనిట్ కు మరొక సమస్య వచ్చి పడింది అనే వార్తలు వస్తున్నాయి.  వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడట. ఈ సినిమా కథను అనుసరించి సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా చాల కీలకం అని అంటున్నారు. ఒడ్డు, పొడుగుతో పాటు మంచి గ్లామర్ ఉన్న అమ్మాయి పవన్ సెకండ్ హీరోయిన్ గా బాగుంటుందని ఈ సినిమా యూనిట్ ముఖ్యంగా ఈ సినిమా దర్శక, నిర్మాతలు కె.ఎస్.రవీంద్ర, శరత్ మరార్ లు భావిస్తున్నట్లు టాక్. దీనితో ప్రస్తుతం పవన్ సెకండ్ హీరోయిన్ హంట్ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, రెజీనా, విశాఖ సింగ్ లమధ్య ఎవరో ఒకరికి ఈ సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు  చేస్తూ ఇంకా ఎవరైనా కొత్త పేరు ఈ సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంపిక అయినా ఆశ్చర్యం లేదు అనే మాటలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. మరి పవన్ వీరిలో ఎవరి పై దృష్టి పెడతాడో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: