యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొద్దిగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ మూవీని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అప్పటి నుండి ఈ మూవీపై పలు రకాల టైటిల్స్ ప్రచారంలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా సెట్స్ పై ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుపుకుంటోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ టైటిల్ ఫైనలైజ్ కాకపోవడం వలన రిలీజ్ చెయ్యలేదు. అయితే ఈ చిత్ర టీం ‘టెంపర్’ అనే టైటిల్ ని ఖరారు చేసింది. త్వరలోనే ఈ టైటిల్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని చిత్ర యూనిట్ నుండి అందిన విశ్వశనీయమైన సమాచారం. కేవలం అనౌన్స్ మెంట్ తోనే సరిపెట్టుకోకుండా, ఒకే సమయంలో ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకూ టెంపర్ అనే టైటిల్ డైలమాలో ఉన్నప్పటికీ, అదే టైటిల్ పై పబ్లిక్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో టెంపర్ టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్టుగా పూరీ జగన్నాధ్ ఆపీస్ నుండి వినిపిస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం డే అండ్ నైట్ షూట్ చేస్తున్నారు. డిసెంబర్ మూడో వారానికి ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేలా అన్ని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాధిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ సైతం నమ్మకాన్ని పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: