పవన్, వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ విడుదల విషయం పై క్లారిటీ రావడంతో ఇక ఈ సినిమా అధికారిక ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది అన్న విషయం పై పవన్ అభిమానులలో రోజురోజుకు ఆత్రుత పెరిగి పోతోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ బైక్ నడుపుతూంటే వెంకటేష్ వెనక కూర్చుని ఉంటాడు అని టాక్. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ హీరోలు ఇద్దరూ ఒకేరకమైన అవుట్ ఫిట్ లో కనిపిస్తూ ఉండే ఈ సీన్ ‘గోపాల గోపాల’ సినిమాలో వచ్చే పవన్, వెంకటేష్ ల మొదటి సీన్ గా కనిపిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఈ నెలాఖరు లోపు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి వచ్చే నెలలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను అత్యంత ఘనంగా చేయడానికి ఈ సినిమా నిర్మాతలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేసారు అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో రచయితలు భూపతి రాజు, సాయి మాధవ్ లు చాల శ్రద్ద తీసుకోవడంతో ఈ సినిమా ద్వితీయార్ధంలో వచ్చే పవన్, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలకు సంబంధించిన డైలాగ్స్ చాల ఆలోచింప చేసే విధంగా ఉంటాయని ఈ ఫిలిం యూనిట్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.  ఇప్పటికే ఈ సినిమాకు బిజినెస్ పరంగా వస్తున్న క్రేజ్ ను బట్టి ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా టాలీవుడ్ రంగానికి సంబంధించి 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాలీవుడ్ విశ్లేషకుల భావన. అయితే ఈ సినిమా ఆడియో విజయం బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సస్ అవుతుంది అనే అంచనాలు తెలుస్తాయి అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ‘గోపాల గోపాల’ క్రేజ్ పవన్ అభిమానులను కుదిపేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: