వివాదాస్పద కామెంట్స్ చేయడంలో ముందు వరసలో ఉండే వర్మ ఈసారి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మధ్య కొత్తగా దేవుళ్ళ రగడను సృష్టించి నిన్న మళ్ళీ వార్తలలోకి ఎక్కాడు. తనకు దేవుడు మీద నమ్మకం లేదు అని అంటూనే తెలంగాణ, ఆంధ్రా దేవుళ్ళు అంటూ నదీ జలాలు విద్యుత్ పంపిణీ రగడలకు తోడు ఈ కొత్త వివాదాన్ని కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య తెలివిగా దూర్చాడు వర్మ. తెలంగాణ ప్రజలకు యాదిగిరి నరసింహుడు ఉండగా, ఆంధ్రా దేవుడు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తున్నారు? అంటూ విచిత్రంగా తన ట్విటర్ లో ప్రశ్నించాడు వర్మ. అంతేకాదు తెలంగాణ ప్రజలు ఆంధ్రా దేవుడు వెంకటేశ్వర స్వామిని పూజించడం అంటే యాదిగిరి నరసింహస్వామిని అవమానించడమేనంటూ విచిత్ర వ్యాఖ్యలు తన ట్విటర్ లో పెట్టాడు వర్మ. అంతేకాదు ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం సంతోషంగా ఉందని, దీనివల్ల తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడి విలువను తెలుసుకునేలా ఉంటుంది అంటూ మరో ట్విట్ చేసాడు వర్మ. అయితే వర్మ నిన్న ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేసాడు అని ఆలోచిస్తున్న విశ్లేషకులు ఒక కొత్త పాయింట్ ను వెలుగులోకి తీసుకు వస్తున్నారు. రేపు వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఐస్ క్రీమ్2’ విడుదల కాబోతోంది కాబట్టి ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేసేందుకు ఈ దేవుళ్ళ రగడ వర్మ తెలివిగా ఇరికించాడు అని కొందరి విశ్లేషణ. ఏమైనా వర్మ దెబ్బకు దేవుళ్ళు కూడా షేక్ అవుతున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: