చిరంజీవి మెగా స్టార్ గా టాలీవుడ్ ను ఏలుతున్న రోజులలో విజయశాంతి రామ్ చరణ్ ల కాంబినేషన్ నిర్మాతలకు కోట్లు కురిపించింది. ‘ఛాలెంజ్’ నుండి ‘గ్యాంగ్ లీడర్’ వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. ఒకప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం కూడా బాగానే ఉండేది. కానీ కొన్ని పరిస్థుతుల కారణంగా చిరంజీవి, విజయశాంతి లమధ్య దూరం పెరిగి ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకునే స్థాయికి మార్చింది.  ఆ తరువాత విజయశాంతి సినిమాలకు దూరమై తెలంగాణా వాదాన్ని భుజాన్న వేసుకుని ప్రచారంలోకి వచ్చిన సందర్భాలలో అనేకసార్లు ఆమె చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలున్నాయి. అటువంటి బద్ధ శత్రువులుగా మారిపోయిన వీరిరువురు ఇప్పటికి కూడా అదే దూరాన్ని కొనసాగిస్తున్నారు  అయితే గత రెండు రోజులుగా వెబ్ మీడియాలో విజయశాంతికి సంబంధించి హడావిడి చేస్తున్న ఒక ఫోటో అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ విజయశాంతి ఒడిలో కూర్చుని గారాలు పోతూ ఉంటే విజయశాంతి చరణ్ ను తన చేతిలో ఉన్న చైన్ తో ఆడిస్తోంది. విజయశాంతి, చిరంజీవి జంటగా నటించిన ‘పసివాడిప్రాణం’ షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో ఇది అనే ప్రచారం జరుగుతోంది. ఈ ఫోటో ఏ సినిమాకు సంబంధించింది అయినా విజయశాంతి ఒడిలో కూర్చుని ఆడుకుంటున్న ఈ బుల్లి చరణ్ ఫోటోను ప్రస్తుత పరిస్థితులలో విజయశాంతి చూసినా లేదా చిరంజీవి చూసినా వారిద్దరికీ నవ్వు తెప్పిస్తుంది అని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఈఫోటో ఇప్పటికైనా విజయశాంతి, చిరంజీవిల కోపాలను పోగోడుతుందేమో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: