నాగచైతన్య తన పుట్టినరోజును రేపు జరుపుకొ బోతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వొడా ఫోన్ సంస్థ గతనెల విడుదలైన తన ‘ఒక లైలా కోసం’ కాంటెస్ట్ విజేతలకు ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన ఉత్సవంలో అభిమానులు అడిగిన అనేక విషయాల పై తన మనసులోని మాటలను ఏమి దాచుకోకుండా అందరితో షేర్ చేసుకున్నాడు.  ఈ సందర్భంలో ఒక అభిమాని తన పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు కాబోయే భార్య ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ హీరోయిన్స్ లో తనకు నచ్చిన అందాలన్ని కలిపి ఒకరిలో ఉండేడట్లుగా ఉన్న అమ్మాయి కోసం తాను వెతుకుతున్నానని, అయితే అలాంటి బ్యూటీ తనకు ఇంకా తటస్థ పడలేదని అంటూ తన పెళ్ళి పై తానే సెటైర్ వేసుకున్నాడు చైతూ. అందుకే ఈ కోరిక విన్న నాగార్జున ‘నీ భార్యను నువ్వే వెతుక్కో’ అంటూ తన పెళ్ళి విషయం అంతా తన పైనే పెట్టేసారని క్లారిటీ ఇచ్చాడు చైతు.  అదేవిధంగా నేటి యంగ్ హీరోలకు క్రేజీగా మారిన సిక్స్ ప్యాక్ బాడీ గురించి మాట్లాడుతూ తనకు అవసరం అనిపిస్తే 8 ప్యాక్ బాడీ తో దర్సనమిస్తాను అంటూ నేటి తరం యంగ్ హీరోలకు సవాల్ విసిరాడు నాగార్జున నట వారాసుడు. తనకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమి లేవని ఛాలెంజ్ గా ఉండే ఎటువంటి పాత్రనైనా చేయడానికి తాను రెడీ అంటూ దర్శకులకు సంకేతాలు ఇచ్చాడు.  ఇదే సందర్భంలో నేటి తరంలో వస్తున్న ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి మాట్లాడుతూ సౌకర్యవంతంగా ఉండే ఎటువంటి ఫ్యాషన్ అయినా తనకు ఇష్టమే అంటూ ఫ్యాషన్ కోసమే తాను బట్టలు వేసుకోననీ అభిప్రాయ పడ్డాడు చైతన్య. ఏమైనా చైతన్య తనకు రాబోయే భార్య గురించి క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఆ అందాల రాశి ఎక్కడ ఉన్నదో వెతకాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: