పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2. ప్రస్తతం ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు అన్నీ పూరైయ్యాయి. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సెట్స్ మీదకు వెళ్ళనుంది. అయితే, ‘గబ్బర్ సింగ్ 2′ చిత్రం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ రెడీ చేశారు. కేవలం రెండు షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 కోసం ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే గబ్బర్ సింగ్2 కోసం పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రిపరేషన్చేసుకున్నాడో, ఇప్పుడు అవే పాయింట్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తునంది. కథ పరంగా,సీన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా పవన్ కళ్యాణ్ పూర్తి ఇన్వాల్మెంట్ ఉందని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ చేసిన మార్పులు కథాపరంగా బాగున్నాయి అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ ‘గోపాల గోపాల’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత డిసెంబర్ లో ‘గబ్బర్ సింగ్ 2′ ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిను తీసుకోవడానికి కారణం కూడ, మూవీకి ఫ్రెష్ లుక్ కనిపిస్తుందని అంటున్నారు. వీలైనంత త్వరగా ‘గబ్బర్ సింగ్ 2′ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు అని సమాచారం. పవన్ సరసన అనీష అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: