మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. ఈ మూవీకి సంబంధించిన తాజా సమాచారం ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ మూవీకి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఉంటుందనే విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. బాలీవుడ్ సూపర్ హిట్ హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కి ఇది రీమేక్. ఫిలిం నగర్లో ఈ చిత్రానికి సంబందించిన వారు చెబుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 28న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన ఎబి కోర్ డిజైన్స్ వారు గత కొద్ది రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసే పనిలో ఉన్నారు. కొన్ని డిజైన్స్ ని ఇప్పటికే వీరు డిజైన్ చేసి ఉంచారు. మరో రెండు రోజుల్లో దాదాపు యాభె రకాల ఫస్ట్ లుక్స్ ని రెడీ చేసి ఉంచుతారు. వాటిలో రెండు ఫస్ట్ లుక్స్ ని పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు ఫైనల్ చేయనున్నారు. మొత్తానికి గోపాల గోపాల మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ నవంబర్ 28 అని తెలియడంతో చిత్ర యూనిట్ కూడ ఈ మల్టీస్టారర్ నటిస్తున్న ఫిల్మ్ టాక్ ని ప్రేక్షకుల వద్ద నుండి వినటానికి తెగ ఆసక్తిగా ఉన్నారు. కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: