సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి, అక్కడ కూడ తన హావాను కొనసాగిస్తున్న బ్యూటీ ఇలియాన. ఇదిలా ఉంటే ఇలియాన తాజాగా నటించిన హ్యాపీ ఎండింగ్ మూవీ బాక్సాపీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. అంతే కాకుండా ఈ మూవీలో ఇలియాన యాక్టింగ్ పై విమర్శకుల వద్ద నుండి ప్రశంసలను అందుకుంటుంది. ముఖ్యంగా ఇలియాన అందాలను బిటౌన్ ని మెస్మరైజ్ చేస్తున్నాయని అంటున్నారు. బర్ఫీ సినిమాతో హిట్ అందుకున్న ఇలియానా ఆ తర్వాత ‘మైన్ తేరా హీరో’ సినిమాతో మరో కమర్షియల్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత ఈ గోవా బ్యూటీ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి చేసిన ఈ ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా, గత చిత్రాల కంటే తన ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాలో అందరూ ఇలియాన గ్లామర్ ని పొగడటమే పనిగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్, ఇలియానా కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన ఈ సినిమాకి రాజ్-డికే డైరెక్టర్స్. సైఫ్ అలీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆఫర్స్ కోసం నిర్మాతలని, దర్శకులని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న ఇలియానికి, ఈ మూవీతో తనకి భారీ ఆఫర్స్ వస్తున్నాయని చెబుతుంది. అయితే తనకి వచ్చే ఆఫర్స్ లో ఎక్కువుగా గ్లామర్ రోల్స్ ఉన్న పాత్రలే వస్తున్నాయంటుంది. ఇకనుండి ఇలియాన సినిమాలో గ్లామర్ శృతిమించబోతుందంటూ బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: