బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా రోజు చాలా కామ్ గా ఉందంటే అది నిజంగా వండరే. ఎందుకంటే బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది గొడవలకు, ఎఫైర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు, తనతో సరిసమానంగా ఉన్న స్టార్ సెలబ్రిటీలతో గొడవకు దిగుతుంటారు. ఇక స్టార్ డం లేని యాక్టర్స్ అయితే, స్టార్ డం ని సంపాదించుకున్న యాక్టర్స్ ని తిట్టే పనిలో ఉంటారు. ఇంకో విధంగా చూసుకుంటే మరోవైపు ఎఫైర్స్ మేటర్స్ హాట్ టాపిక్స్ గా మారుతుంటాయి. అందరూ స్టార్ డం అంటూ తేడా లేకుండా ఎవరికి వారు, నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విధంగా ప్రతీ రోజు బిటౌన్ లో హాట్ టాపిక్ కాని మేటర్ అంటూ ఏమి ఉండదు. ఇన్ని గోడవల మధ్య తాజాగా స్టార్ హీరోయిన్స్ తిట్టుకుంటూ హాట్ టాపిక్ గా నిలిచారు. బి-టౌన్ భామలు అయిన కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలు ఈ మధ్య కాలంలో ఎడమొహం పెడమొహంగా ఉండటం జరుగుతుంది. ఎవరికి వారు, ఎదురు పడినా ఇద్దరూ ఒకరికొకరు పలకరించుకోలేదట. తాజాగా వీరిద్దరూ సల్మాన్ ఖాన్ చెల్లి అర్పితా ఖాన్ పెళ్ళికి సంబంధించిన ఓ ఫంక్షన్ లో ఒకరికొరు ఎదురుపడినా, ఏ మాత్రం తెలియనట్టుగా వ్యవహరించారంట. దీంతో వీరిద్దరూ వ్యవహారాన్ని చూసిన అక్కడి వారు, ఒకటే గుసగుసలు. అంతే కాకుండా ఓ ప్రవేట్ ఫంక్షన్ కి అనుకోకుండా ఇద్దరూ రావడంజరిగింది. అక్కడ ఫంక్షన్ లో ఇద్దరూ ఒకే స్టేజ్ పై కూర్చొకున్నారు. కాని ఫంక్షన్ చివరి వరకూ ఇద్దరూ ఉండలేకపోయారు. కారణం ఏమిటంటే, వీరిద్దరికి సమానైన మార్యద దొరకలేదని నిర్వాహకులతో చెప్పి, ఇద్దరూ ఒకటికొకరు తిట్టుకుంటూ ఆ ఫంక్షన్ నుండి వెళ్ళిపోయారంట. వీరి వ్యవహారతో ఆ ఫంక్షన్ ఆర్గనైజర్స్ హడలిపోయారంట.

మరింత సమాచారం తెలుసుకోండి: