పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ అనేది మెయిన్ ఎట్రాక్షన్ గా కాకుండా పవన్ సరసన వెంకటేష్ నటించడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ దాదాపు ఒకే మెంటాలిటీని కలిగి ఉంటారని ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. ఇదిలా ఉంటే ఈ గోపాల గోపాల మూవీ అతి పెద్ద మల్టీస్టారర్ మూవీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ క్రేజ్ ని అందుకుంటుంది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ కసరత్తులు ప్రారంభించింది. ఈ మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి బరిలో ఉందని తెలియగానే దాదాపు చాలా చిత్రాలు వాటి రిలీజ్ డేట్స్ ని మార్చుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు అయితే అస్సలు సంక్రాతి బరి నుండి పూర్తిగా తప్పుకొని, గోపాల గోపాల రిలీజ్ తరువాత మరో నెల రోజులుకి రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అయితే కేవలం రెండు చిత్రాలు మాత్రం గోపాల గోపాల మూవీకి పోటీ ఇవ్వటానికి సిద్ధపడుతున్నాయి. వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న టెంపర్ మూవీ. రెండోది శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఐ మూవీ. ఈ రెండు మూవీలు గోపాల గోపాల మూవీకి సంక్రాంతి ఫెస్టివల్ లో పోటీ పడనున్నాయి. పవన్ కళ్యాణ్ జపంతో ఊగిపోతున్న టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి జూనియర్ టెంపర్ మూవీ, ఐ మూవీలు ఏ విధంగా బాక్సాపీస్ వద్ద నిలబడతాయో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ గొప్ప మూవీ అయినప్పటికీ, జూనియర్ మూవీ కథ బలంగా ఉన్నప్పటికీ బాక్సాపీస్ వద్ద మాత్రం గోపాల గోపాల మూవీ విజృంభించటం ఖాయం అని టాలీవుడ్ ట్రేడ్స్ చెబుతున్న లెక్కలు. మొత్తానికి 2015 సంక్రాంతి ఫెస్టివల్, ఫిల్మ్ ఫెస్టివల్ గా సినీ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: