మహేష్‌ బాబు, కొరటాల శివల సినిమా గోవా షెడ్యూల్ మధ్యలో ఆగిపోవడానికి శ్రుతి హాసన్ కారణం అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తల పై మరింత క్లారిటీ వస్తోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రుతి హాసన్ ఈ సినిమా నుండి తప్పుకుందని గాసిప్పులు వినపడుతున్నాయి. అంతేకాదు ఆమె స్థానంలో సమంత ఎంపిక జరిగి పోయింది అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకే సమయంలో అటు మహేష్ తో ఇటు విజయ్ తో సినిమాలు చేస్తున్న శ్రుతి హాసన్ ఇస్తున్న డేట్స్ ఏమాత్రం మహేష్, కొరటాల సినిమాల సినిమాకు సరిపోక వోవడంతో ఈ అనుకోని నిర్ణయానికి మహేష్ వచ్చాడు అనే వార్తలు ఉన్నాయి. వారం రోజులు మాత్రమే జరిగిన ఈ సినిమా షూటింగ్ లో శ్రుతి విజయ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని చెన్నై నుంచి గోవా రావలసి వచ్చిన సందర్భంలో రెండు సార్లు ఫ్లైట్ మిస్ కావడంతో షూటింగ్ స్పాట్ కు ఆలస్యంగా రావడంతో కేవలం వారం రోజుల షూటింగ్ కే తీవ్ర అంతరాయం ఏర్పడటంతో భవిష్యత్ లో శ్రుతి డేట్స్ సమస్య మరింత అంతరాయాన్ని మహేష్ కొత్త సినిమాకు కలిగిస్తుంది అన్న ఉద్దేశ్యంతో ప్రిన్స్ మళ్ళీ యూటర్న్ తీసుకుని సమంత వైపు వెళ్ళాడు అని టాక్. అయితే ఇదంతా శ్రుతి హాసన్ డేట్స్ సమస్య వలెనే జరిగిందా? లేదంటే సమంతతో కాకుండా కృతి సనన్, తమన్నాలతో జతగట్టి మహేష్ నటించిన సినిమాలు వరస పరాజయాలు చెందడంతో సెంటిమెంట్ రీత్యా మహేష్ తిరిగి ఈ యూటర్న్ తీసుకున్నాడా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా సమంత తనమాయతో మహేష్ కు ఈ సినిమాలో జత కట్టడం ద్వారా తిరిగి తన గోల్డెన్ లెగ్ అదృష్టాన్ని తెచ్చి పెడుతుందేమో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: