టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్న హీరో నితిన్. ప్రస్తుత కాలంలో నితిన్ వరుసగా మూవీలను రిలీజ్ చేయకుండా ఆలోచించి మూవీలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆ విధంగానే నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకుంటున్న ప్రస్తుత ఫిల్మ్ కెరీర్, ఫుల్ జోష్ లో ఉంది. ఇదిలా ఉంటే నితిన్, ఓ టాప్ స్టారర్ తనయడి డెబ్యూ ఫిల్మ్ లో ఓ రోల్ చేస్తున్నాడనే విషయం తెలిసింది. అఖిల్ అక్కినేని హీరోగా రాబోతున్న మూవీలో నితిన్ ఓ రోల్ చేస్తున్నాడు. ఎందుకంటే అఖిల్, నితిన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి ఫ్రెండ్స్. దీంతో, ఇప్పుడు అఖిల్ నటిస్తున్న డెబ్యూ సినిమా విషయంలో నితిన్ చాలా యాక్టివ్ గా ఉన్నాడట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తను బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. స్టోరీ డిస్కషన్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నాడని సమాచారం. అలాగే, ఆర్టిస్టుల ఎంపికలో కూడా హెల్ప్ చేస్తున్నాడట. కొన్ని రోల్స్ కి అయితే నితినే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అఖిల్ డెబ్యూ మూవీకి డైరెక్టర్ గా వినాయక్ పనిచేస్తున్నప్పటికీ, కొన్ని నిర్ణయాలు వినాయక్ కి సైతం తెలియకుండానే జరగిపోతున్నాయంటూ చిత్ర యూనిట్ నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో నితిన్ హైపర్ యాక్టివ్ అందరూ అవాక్కవుతున్నారంట. ఈ దూకుడికి నాగార్జున త్వరలనే బ్రేక్స్ వేయడం ఖాయం అని అంటున్నారు. అఖిల్ డెబ్యూగా వస్తున్న ఈ చిత్రానికి నితిన్ తండ్రి నిర్మాత కూడా కావడంతో నితిన్ మరింత చొరవ తీసుకుంటున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: