టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2015 సంక్రాంతికి మూవీ ఫెస్టివల్ జరగనుంది. అయితే ఇందుకు మూడు ప్రధాన చిత్రాలు 2015 సంక్రాంతి వేధికగా పోటీ పడనున్నాయి. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ, అలాగే మల్టీస్టారర్ మూవీ గా రాబోతున్న వెంకటేష్-పవన్ కళ్యాణ్ ల గోపాల గోపాల మూవీ. ఇవి రెండు కాకుండా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఐ ఫిల్మ్. ఈ మూడు ఫిల్మ్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరగనుంది. అయితే ఈ పోటీ నుండి శంకర్ ఐ మూవీ తప్పుకునే ఛాన్స్ కనిపించనుందని అంటున్నారు. ఎందుకంటే జూనియర్ నటిస్తున్న టెంపర్ మూవీకి, అలాగే మల్టీస్టారర్ గోపాల గోపాల మూవీలకే టాలీవుడ్ లో థియోటర్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఇప్పడు ఐ మూవీ రిలీజ్ కి చాలా తక్కువ థియోటర్స్ దొరుకుతున్నాయి. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మూవీలకి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, అదే సమయంలో టాలీవుడ్ హీరోలు రిలీజ్ చేసే మూవీలు ఆధిపత్యం చెలాయించే సమస్య ఉంది. అందకే ఈ పోటీ నుండి వెనక్కి వెళ్లి, ఐ రిలీజ్ ను మరి కొద్ది రోజులు తరువాతకి పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతే కాకుండా సంక్రాంతి, దసరా వంటి పెద్ద ఫెస్టివల్స్ కి అనువాద చిత్రాల్ని విడుదల చేయరాదనే ఆంక్ష ఒకటి టాలీవుడ్ లో ఉంది. ఇప్పుడు దానిని అమలు చేసి ‘ఐ’కి చెక్‌ చెప్తారు అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వాదన. మొత్తానికి శంకర్ మూవీ ఐ ని ఏదొక విధంగా రిలీజ్ కాకుండా ఆపటానికి ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు మంతనాలు చేస్తున్నారు. ఎందుకంటే గోపాల గోపాల మూవీ, టెంపర్ మూవీ ల కంటే ఐ మూవీ బ్లాక్ బస్టర్ అయిందంటే, ఇది టాలీవుడ్ బాక్సాపీస్ కే అతి పెద్ద నష్టం మారే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకూ థియోటర్ సమస్యతో ఐ మూవీని ఇరుకున పెడితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: