నిన్నటి సాయంత్రం దాకా ‘లింగ’ విడుదల వాయిదా పడుతుంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో రజినీకాంత్ కుమార్తె సౌందర్య రంగంలోకి దిగి ఆ వార్తలను ఖండించడమే కాకుండా ‘లింగ’ సినిమా సెన్సార్ పూర్తి అయిన విషయాన్ని తన ట్విటర్ లో తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చింది. ‘లింగ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అని తెలపడమే కాకుండా ఈ సినిమాకు సెన్సార్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చిందని సౌందర్య తెలియచేసింది.  తన తండ్రి పుట్టినరోజు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు మూడువేల థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుందని సౌందర్య తెలియచేసింది. అంతేకాదు సెన్సార్ ఎటువంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వడంతో యూనిట్ అంతా పండగ చేసుకుంటోంది అని సౌందర్య తెలియచేసింది. అయితే ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 50 నిమిషాలని వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద నిడివి తో సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకులు ఏమైనా బోర్ ఫీలవుతారా అనే విషయం పై దర్శకుడు రవికుమార్, రజినీకాంత్ లు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ‘లింగ’ తాను రాసిన ‘ముల్లవనం 999’ కథకు కాపీ అంటూ కె ఆర్ రవి రతనం అనే వ్యక్తి మధురై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై సరైన ఆధారాలు ఇప్పటికీ చూపించ లేకపోవడంతో ఈ పిటీషన్ ను మధురై కోర్టు కొట్టి వేస్తే ఇక ‘లింగ’ కు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు లేదనే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: