అబ్బాయ్ జూనియర్ ఇప్పటికే తాను నటించిన సినిమాలలో పాటలు పాడి తన టాలెంట్ ను నిరూపించుకున్న నేపధ్యంలో ఈ విషయంలో కూడా తాను జూనియర్ కన్నా గొప్పవాడిని అని నిరూపించు కోవడానికి నందమూరి సింహం బాలయ్య తన సింగింగ్ టాలెంట్ ను జనానికి చూపించి అదర గొట్టడానికి మేము సైతం వేదిక పై ప్రయత్నాలు చేయబోతున్నాడు బాలకృష్ణ.  హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కలిసి ఈ నెల 30న నిర్వహింపబోతున్న ‘మేము సైతం' కార్యక్రమంలో లెజెండ్ బాలకృష్ణ రెండు పాటలు పాడడానికి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కోటి నిర్వహిస్తున్న సంగీత విభావరిలో బాలకృష్ణ చేయబోతున్న ఈ సంగీత కచేరి ‘మేము సైతం’ కార్యక్రమానికి హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. అయితే బాలకృష్ణ పాడబోతున్న పాటలు తన తండ్రి నందమూరి తారకరామారావు సినిమాలలోనివా? లేదంటే బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాలలోనివా? అనే విషయం పై చివరి నిముషం వరకు క్లారిటీ ఉండదు అని అంటున్నారు. సామన్యంగా ఇటువంటి కార్యక్రమాలలో రావణాసురిడిగా, లేదా దుర్యోధనుడుగా బాలకృష్ణ నటించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే ఇలా అందరి అంచనాలను తారుమారు చేస్తూ బాలయ్య గాయకుడి అవతారం ఎత్తడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: