దగ్గుపాటి రానాకి అభిమానులు కావాలట. ఎందుకంటే, తొలిచిత్రం ‘లీడర్’తో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తరువాత రానా నటించిన సినిమాలేవీ ప్రేక్షకులని థియేటర్ కి రాబట్టలేకపోయాయి. ఇక్కడ వర్కౌట్ కావట్లేదని... బాలీవుడ్ వైపు చూశాడు. రాంగోపాల్ వర్మతో ‘డిపార్ట్ మెంట్’లో కనిపించాడు. ఆ చిత్రం అక్కడ సూపర్ ఫ్లాప్. ఇప్పుడు దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో ‘కృష్ణం వందేజగద్గురం’ విడుదలకు సిద్ధమౌతోంది. ఇందులో వెంకటేష్ కూడా ఓ పాటలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కేవలం మాంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకే వెంకీని ఈ చిత్రంలోకి ప్రవేశింపజేశారని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరోపక్క ఈ మధ్యనే విడుదలైన ఆ చిత్రం ట్రైలర్స్ చాలామందిలో కాస్త హోప్స్ పెంచుతున్నాయి. దానికి దర్శకుడు క్రిష్ కూడా ఒక కారణమే. మరి, రానా అభిమానులెవరు? అందుకే, వెంకటేష్ కు ఉన్న ఫ్యాన్ బ్యాంక్ ని రానా అకౌంట్లోకి కాస్తైనా కన్వర్ట్ చేయాలని వెంకటేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందో కొద్దిరోజులు ఓపిక పడితే తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: