బ్రహ్మనందం హేమల కాంబినేషన్ లో చాల హిట్ సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా వీరిద్దరి కాంబినేషన్ ను ఇష్టపడతారు. ‘అతడు’ సినిమా నుండి వీరి కాంబినేషన్ కు క్రేజ్ పెరిగి అలాగే కొనసాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఎదో తేడా వచ్చినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. హేమ ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తెలుస్తోంది. తనకు బ్రహ్మనందం వల్ల కొన్ని తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి పోయాయని హేమ గగ్గోలు పెడుతున్నట్లు టాక్. ఇదే విషయం హేమ బ్రాహ్మి దృష్టికి తీసుకు వెళితే ఆ సినిమా నిర్మాతలకు బడ్జెట్ సమస్య వల్ల తనను కాకుండా మరొకరిని తీసుకుని ఉంటారని బ్రహ్మి హేమకు సద్ది చెప్పాడని న్యూస్. అయితే అసలు విషయం మరోలా వినిపిస్తోంది.  ఈమధ్య ఒక సందర్భంలో హేమ రెగ్యులర్ గా చేస్తున్న వారితోనే మళ్ళీమళ్ళి నటించడం బోరు కొడుతోందని కామెంట్స్ చేసిందనే గాసిప్పులు ఉన్నాయి. ఈ కామెంట్స్ బ్రహ్మి దృష్టి వరకు వెళ్ళడంతో కోపగించిన బ్రహ్మనందం తన పక్కన హేమను కాకుండా మరేవ్వరినైనా పెట్టమని సూచించడంతో హేమకు అవకాశాలు తగ్గిపోతున్నాయని టాక్. ఏమైనా వెండితెర పై విపరీతంగా నవ్వించే బ్రహ్మనందానికి కోపం వస్తే ఎలా ఉంటుందో వినపడుతున్న ఈ వార్తలను బట్టి అర్ధం అవుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: