తాను నిర్మించే సినిమాలే కాదు తాను నటించే పాత్రలు కూడా చాల విభిన్నంగా ఉండడానికి నిరంతరం తపన పడే మంచు లక్ష్మి జిమ్ లో చేస్తున్న విన్యాసాల వీడియో ఇప్పుడు వెబ్ మీడియాలో చాలామందిని ఆకర్షిస్తోంది. తెలుగు ప్రజల ‘మేరీ కొమ్’ గా సరికొత్త గెటప్ లో మంచు లక్ష్మి తన ట్రైనర్ తో చేస్తున్న విన్యాసాలు తన బాడీ ఫిట్నెస్ కోసమా లేదంటే తన రాబోతున్న సినిమాలలో ఇటువంటి తరహా పాత్రను పోషించడానికా అనే సందేహం ఈ విడియోను చూసిన వారికి కలుగుతుంది. మంచు లక్ష్మి ఒక యాక్షన్ హీరోగా మారిపోయి చేస్తున్న ఈ జిమిక్స్ కేవలం కాలక్షేపానికి కాకుండా ఎదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడలోనే చేస్తోంది అన్నది వాస్తవం. ప్రస్తుతం ‘పిలవని పేరంటం’ అనే సినిమాలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న ఈ మంచు వారి అమ్మాయి. ఈ కొత్త గెటప్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే బయట పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు తన తమ్ముడు మంచు మనోజ్ కండలు వీరుడుగా మారి ఒకొక్క సినిమాకు ఒకొక్క గెటప్ లో కనిపిస్తూ ఉంటే తన తమ్ముడిని ఆదర్శంగా తీసుకుని ఇలా జిమిక్స్ చేస్తోందా లేదంటే స్త్రీల పై రోజురోజుకు పెరిగి పోతున్న అత్యాచారాల నేపధ్యంలో మహిళల కోసం భారీ స్థాయిలో ఒక కార్పోరేట్ జిమ్ పెడుతుందా అనే సందేహం కూడా ఈ వీడియో చూసిన వారికి కలుగుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: