నిన్న తన 30వ పుట్టినరోజును హీరో రానా చాల డిఫరెంట్ గా బల్గేరియాలో జరుపుకున్నాడు. రాజమౌళి రానా అభిమానులను ఆశ్చర్య పరుస్తూ తాను నిర్మిస్తున్న ‘బాహుబలి’ లోని భల్లాల దేవ ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. ఇప్పటి వరకు చాల సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రానా పోషించినా తన ఇమేజ్ ని పెంచే పాత్రను ఇప్పటి వరకు రానా తెలుగు సినిమాలలో చేయలేకపోయాడు.  ఇప్పుడు ఆలోటు ‘బాహుబలి’ తనకు తీర్చిందని రానా భావిస్తున్నాడు. రానా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాల సంవత్సరాలు గడిచిపోయినా రాబోతున్న 2015 రానా కెరియర్ కు సంబంధించి ఒక కీలక సంవత్సరంగా మారనున్నది. రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాలతో పాటు బాలీవుడ్ లో రానా ప్రముఖ పాత్ర పోషించిన ‘బాబి’ రాబోతున్న కొత్త సంవత్సరం జనవరిలో విడుదల కానున్నది.  నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా పై కూడా రానా చాల ఆశలే పెట్టుకున్నాడు. ఒక వైపు టాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మరో వైపు బాలీవుడ్ లో కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న రానాకు రాబోతున్న 2015 ఎటువంటి టర్నింగ్ పాయింట్ ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: