టెంపర్ విడుదల వాయిదా పడటంతో ఆ సినిమా విడుదల అవుతుంది అనుకున్న రాబోతున్న జనవరి 9న శంకర్ విక్రమ్ ల ‘ఐ’ విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ పూరీల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘టెంపర్’ షూటింగ్ తన సోదరుడు జానకి రామ్ మరణం తరువాత జూనియర్ తిరిగి ప్రారంభంచినా ఆ సినిమా షూటింగ్ లో జూనియర్ తన పాత్ర విషయమై తన బెంగ నుండి నటనలో సరైన ఏకాగ్రత పెట్టలేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ నిలుపుదల చేసారు అని టాక్. దీనితో జనవరి 9వ తారీఖు ఖాళీ ఉండటంతో ఆ ఖాళీని విక్రమ్ ‘ఐ’ పూడ్చబోతోంది అనే వార్తలు ఊపు అందుకున్నాయి. దీనితో నిన్నటిదాకా పవన్ గోపాలుడిని ఎదిరించే పెద్ద సినిమాలు ఏమి లేవు అని అనుకుంటున్నా నేపధ్యంలో అనుకోకుండా యూటర్న్ తీసుకుని విక్రమ్ ‘ఐ’ ముందుకు జరగడంతో రాబోతున్న సంక్రాంతికి పవన్, విక్రమ్ ల మధ్య పోటీ తప్పదు అనే సంకేతాలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే ప్రప్రధమంగా టాలీవుడ్ లో సంక్రాంతికి ఒక భారీ డబింగ్ సినిమా విడుదల కావడమే కాకుండా టాలీవుడ్ ఎంపరర్ పవన్ కు పోటీగా మారడంతో రెండు భారీ సినిమాల మధ్య పోటీకి తెర లేస్తోంది అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: